టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. మరికొన్ని గంటల్లో ఈ 30 ఏళ్ల స్పీడ్ స్టర్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టి దివ్య సింగ్ అనే వధువు మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ కారణంగానే అతను భారత్ - ఆస్ట్రేలియా మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న ఐదో టీ20కి దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.
మూడో టీ20 ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు ముఖేష్ పెళ్లి కారణంగా సెలువు తీసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. "మూడో టీ20 నుంచి విడుదల చేయాలని ముకేశ్ మమ్మల్ని అడిగాడు. ఈరోజు అతడి పెళ్లి సందర్భంగా అతడు సెలవు తీసుకున్నాడు. రాయ్‌పూర్‌లో జరుగబోయే నాలుగో మ్యాచ్‌కు ముందే అతడు జట్టుతో కలవనున్నాడు.." అని ట్వీట్ చేసింది.
Mukesh Kumar misses the 3rd T20I due to his marriage.#INDvAUS pic.twitter.com/C0llLXiEkb
— CricAsh (@ash_cric) November 28, 2023
ఎవరీ దివ్య సింగ్..?
ముఖేష్ కాబోయే భార్య బీహార్, చప్రాలోని బనియాపూర్ బెరుయ్ గ్రామ నివాసి. ఆమె పేరు దివ్య సింగ్. ఇప్పటికే వీరి వివాహ వేడుకలు మొదలయ్యాయి. హల్దీ వేడుక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The Haldi ceremony of Mukesh Kumar ahead of his wedding. pic.twitter.com/tDqM3BiFTo
— Johns. (@CricCrazyJohns) November 28, 2023
మూడు ఫార్మాట్లలోనూ
ముఖేష్ కుమార్ ఏడాదిలోనే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం గమనార్హం. జులైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. అనంతరం ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు.