అందాల రాక్షసి ప్రేమకు క్లీన్ బౌల్డ్.. ప్రేయసిని పెళ్లాడిన భారత బౌలర్

అందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి.. మాకెప్పుడూ అవుతాయా అని ఏడవకండి.. సమయం వచ్చినప్పుడు మీకూ పెళ్లిళ్లు అవుతాయి.. ఎక్కడోచోట వధువు మీకోసం పుట్టే ఉంటుంది.. బాధపడకండి.. కొన్నాళ్లే ఈ కష్టాలు. అలాగే, ఇప్పటికే మూడు ముళ్ళు వేససినవారు మరోసారి అలాంటి ఆలోచన చేయకండి. పోషించడం చాలా కష్టం.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా! భారత జట్టులో బ్యాచిలర్స్ సంఖ్య తగ్గుతోందని బాధపడుతున్న పెళ్లికాని ప్రసాదులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పేందుకే..

మొదట కేఎల్ రాహుల్.. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు నవదీప్ సైనీ.. చూశారుగా భారత క్రికెటర్లు జీవితంలోకి మరొకరిని ఆహ్వానించేందుకు ఎంతలా తొందపడుతున్నారో.. భారత పేస్ గుర్రం నవదీప్ సైనీ తన ప్రేయసి స్వాతి ఆస్థానను వివాహం చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.  ప్రేమించుకున్నాం.. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసికుంటాం అని ఈ జంట పెద్దలకు చెప్పారట. వాళ్ళు అందుకు ఓకే చెప్పగానే వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. అందుకు సంబంధించిన ఫొటోల‌ను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్ చేశాడు.

ఎవరీ స్వాతి అస్థానా

స్వాతి అస్థానా గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ, ఆమె ఒక సోషల్ మీడియా  ఇన్ ఫ్లూయెన్సర్ అని తెలుస్తోంది. ఫ్యాషన్, ట్రావెల్ మరియు లైఫ్‌స్టైల్ కు సంబంధించి, తన ప్రయాణ అనుభవాల గురించి ఈ అందాల రాక్షసి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేస్తుంటదట.