క్లీన్​ టెక్నాలజీ..పేపర్ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గిస్తాం: ఇప్మా ప్రెసిడెంట్​

క్లీన్​ టెక్నాలజీ..పేపర్ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గిస్తాం: ఇప్మా ప్రెసిడెంట్​
  • ఇప్మా ప్రెసిడెంట్​ పవన్ అగర్వాల్ 

హైదరాబాద్, వెలుగు:పేపర్ పరిశ్రమలో కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నామని, క్లీన్ టెక్నాలజీల వాడకాన్ని పెంచుతున్నామని ఇండి యన్ పేపర్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఇప్మా) ప్రెసిడెంట్​ పవన్ అగర్వాల్ పేర్కొన్నారు.

 ఇప్మా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన పేపర్‌‌‌‌‌‌‌‌టెక్ 18వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ క్లీన్​ టెక్నాలజీల వల్ల కాగితపు పరిశ్రమకు మేలు జరుగుతుందని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీల ద్వారా కార్బన్ పాదముద్రను తగ్గించడానికి పరిశ్రమ నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు.

 తక్కువ శక్తిని వాడుకునేలా పేపర్​మిల్లులను అప్​గ్రేడ్​చేశాయని, టెక్నాలజీలను వాడుతున్నాయని చెప్పారు. నీటి వినియోగాన్ని టన్ను పేపర్‌‌‌‌‌‌‌‌కు 200 క్యూబిక్ మీటర్ల నుంచి 50 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు తగ్గించాయని అన్నారు.  రోజువారీ ఉపయోగంలో ప్లాస్టిక్​కు బదులు కాగితం ఉత్పత్తులను ఎక్కువగా స్వీకరించాలని ఆయన ప్రజలను కోరారు. 

 గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి దాదాపు 40 పేపర్ మిల్లులు త్వరలో భారతదేశ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్​ లో భాగమవుతాయని వెల్లడించారు. గత ఐదేళ్లలో ఇంధన వినియోగం 20శాతం తగ్గిందని పవన్​ అగర్వాల్​ వివరించారు.