న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో ఇన్వెస్టర్లకు ఫార్మా సెక్టార్ అత్యధిక రాబడులను ఇచ్చింది. ఈ ఇండెక్స్ 39 శాతం ఎగిసింది. తరువాత స్థానాల్లో రియల్టీ, కన్జూమర్డ్యూరబుల్స్ సెక్టార్లు ఉన్నాయి. మరో ఎనిమిది సెక్టార్లు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇవి బీఎస్ఈ సెన్సెక్స్‌కు మించి రాబడులను తెచ్చిపెట్టాయి. అయితే ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు మాత్రం వెనకబడ్డాయి.
బీఎస్ఈ రియల్టీ 35 శాతం రిటర్నులను ఇచ్చింది. అనంత్‌రాజ్, శోభా, ఒబెరాయ్రియల్టీ, ప్రెస్టిజ్ఎస్టేట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్షేర్లు 44–178 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి. కన్జూమర్డ్యూరబుల్స్, కన్జూమర్ డిస్క్రెషనరీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీస్, మెటల్సెక్టార్లు 10 శాతం నుంచి 29 శాతం వరకు ఎగిశాయని ఒక ఎనలిస్టు తెలిపారు.