మాస్కోకు వెళుతున్న భారత విమానం జనవరి 20న బదక్షన్‌లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయిందని ఆఫ్ఘనిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బదక్షన్‌లోని తాలిబాన్ సమాచార, సంస్కృతి చీఫ్ సైతం ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రావిన్స్‌లోని కరణ్, మంజన్, జిబాక్ జిల్లాలను కవర్ చేసే తోప్‌ఖానే పర్వతంలో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని వెల్లడించారు.
ఘటనపై విచారణకు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం, ప్రమాదానికి గల కారణాల గురించిన సమాచారాన్ని మాత్రం ఇప్పటి వరకు అధికారిక వర్గాలు అందించలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం విమానాలు బయల్దేరు సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని తేలింది. ప్రమాదానికి గురైన విమానం చార్టర్డ్ విమానం అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Indian passenger plane' crashes in Afghanistan, reported to be heading for 'Moscow' #PlaneCrash #Afghanistan #Afganistan #Moscow #planecrash #Afghan #Emergency #Moscow #PlaneCrash #Russia #Afghanistan #IndianPlaneCrash #Plancrash #Accident #Afghanistan #Indianplane… pic.twitter.com/e7EMocxuQ3
— Neha Bisht (@neha_bisht12) January 21, 2024