Cricket World Cup 2023: టీమిండియాతో ఫుట్ బాల్ దిగ్గజం.. సచిన్‪తో కలిసి కీలక సలహాలు

Cricket World Cup 2023: టీమిండియాతో ఫుట్ బాల్ దిగ్గజం.. సచిన్‪తో కలిసి కీలక సలహాలు

వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ సమరం ప్రారంభమైంది. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది. ఇండియా, ఇండియా అంటూ భారత అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. సొంతగడ్డపై ఈ సెమీస్ పోరు జరుగుతుండడంతో మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ కు ముందు గ్రౌండ్ లోకి ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బేక్ హమ్ రావడం హైలెట్ గా మారింది.
 

also read :- IND vs NZ: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 84/1


ఇంగ్లాండ్ కు చెందిన ఈ మాజీ స్టార్ ఆటగాడు భారత క్రికెటర్లను కలిసి ముచ్చటించాడు.  క్రికెట్ గాడ్ సచిన్  టెండూల్కర్ తో కలిసి మన ఆటగాళ్లకు కీలక సలహాలు ఇచ్చారు. యూనిసెఫ్(UNICEF) గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న బెక్‌హ‌మ్ మూడు రోజుల‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీస్ పోరును చూసేందుకు ముంబైలోని వాంఖ‌డే స్టేడియానికి వచ్చాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ ఈ మ్యాచ్ కు హాజరు కావడంతో వీరిద్దరూ కలిసి ఈ మ్యాచ్ ను చూసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం భారత ఇన్నింగ్స్ చూసుకుంటే తొలి 6 ఓవర్లు ముగిసేసరికి 58 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్లపై చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగిన హిట్ మ్యాన్ 23 బంతుల్లోనే 45 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. మరో ఓపెనర్ గిల్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.