ఛాంపియన్స్ ట్రోఫీకి స్క్వాడ్ ను అనౌన్స్ చేసింది టీమిండియా. 2025 ఫిబ్రవరీ 19 న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫికి టీమ్ అనౌన్స్ చేయడంతో ప్లేయర్ల కూర్పు ఎలా ఉందనే చర్చలు మొదలయ్యాయి. అయితే 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టీమ్ లో ఉన్న చాలా మంది ప్లేయర్లు ప్రస్తుత స్క్వాడ్ లో ఉన్నారు.
2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు ప్రస్తుత స్క్వాడ్ లో కొందరికి అవకాశం దక్కలేదు. నలుగురు ప్లేయర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకోలేదు. అందులో టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాంత్ కిషన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసరర్ మొహమ్మద్ సిరాజ్ లకు ప్రస్తుత స్క్వాడ్ లో స్థానం దక్కలేదు.
ALSO READ | Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
అయితే 2023 వరల్డ్ కప్ లో ఆడిన యశశ్వీ జైస్వాల్, రిశభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్శ్దీప్సింగ్ లకు ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ లో ప్లేస్ దక్కింది.