హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ తమ ఫ్లాగ్‌షిఫ్ ఈవెంట్ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్ 30వ ఎడిషన్‌ను వచ్చే నెల 21– 23న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. సస్టయినబిలిటీ విధానాల్లో నీటి పాత్రను గురించి, టెక్నాలజీ సాయంతో నీటిని సమర్ధవంతంగా వాడడం, కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు.
అంతేకాకుండా నీటి నిర్వహణను మెరుగుపరిచే ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిలుగా పాల్గొననున్నారు.