![ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాకు ప్రధాని మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/indian-pm-modi-to-visit-us-from-february-12-and-13-hold-talks-with-trump_zkWymPIMRu.jpg)
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12, 13 తేదీల్లో భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులను అమెరికా వెళ్లగొడుతున్న సమయంలోనే ఈ పర్యటన జరుగుతోంది.
మొదట ఫ్రాన్స్..
అమెరికా పర్యటనకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల నేతల మధ్య ఏరోస్పేస్, జలాంతర్గాములపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, మోదీ భారతదేశం భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ఉన్న కాడరాచేను సందర్శించనున్నారు.
ALSO READ | 487 మందితో అమెరికా నుంచి మరో విమానం: సంకెళ్లు వేయకుండా పంపాలని ఇండియా రిక్వెస్ట్