IPL 2025: మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అధికారిక ప్రకటన

ఐపీఎల్ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుందో అధికారిక ప్రకటన వచ్చేసింది. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుందని బీసీసీఐ వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా అధికారికంగా వెల్లడించాడు. ఆదివారం (జనవరి 12న) ఇండియా టుడేతో మాట్లాడిన శుక్లా.. ఐపీఎల్ మే 25న ఐపీఎల్ ముగుస్తుందని తెలిపారు. గతేడాది మార్చి 22 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కాగా.. ఈసారి ఒక రోజు ముందే ప్రారంభం కానుంది. మొదట ఐపీఎల్ మార్చి 23 న జరుగుతుందని తప్పుగా ప్రకటించిన శుక్లా ఆ తర్వాత మార్చి 21 న జరుగుతుందని చెప్పారు. 

సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు రూ. 639.15 కోట్లకు అమ్ముడుపోయారు. 10 జట్లు తమ తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత మెగా ఆక్షన్ లో తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 574 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను వెల్లడించిన తర్వాత రెండు మార్క్యూ సెట్ల ఆటగాళ్లు వేలంలో ఆధిపత్యం చెలాయించారు.

ALSO READ | Team India: బీసీసీఐ రివ్యూ మీటింగ్.. రంజీ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ, రోహిత్

భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడై ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75 కోరెర్), వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) ఈ లిస్ట్ లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.    డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు.