రష్యా అధ్యక్షుడిగా విజయం సాధించిన పుతిన్‪కు మోదీ శుభాకాంక్షలు

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వ్లాదిమిర్ పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  మార్చి 15న ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగి 17న ముగిసింది. ఇప్పటికే 1999 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్‌.. మరో ఆరేండ్లపాటు ఆ పదవిలో ఉండనున్నారు. దాంతో రష్యాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన జోసెఫ్‌ స్టాలిన్‌ రికార్డును అధిగమించనున్నారు. ఇప్పుడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ ఘన విజయం సాధించారు. దాంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. 

రష్యన్‌ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌కు శుభాకాంక్షలు. భారత్‌, -రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం పుతిన్‌తో కలిసి పనిచేయాడానికి నేను ఎదురుచూస్తున్నానని ప్రధాని తన అధికారిక ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని మోదీ తెలిపారు. రష్యా, భారత్ కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి.