ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో రన్నరప్ అలీభాయ్

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో  రన్నరప్ అలీభాయ్

చెన్నై:  ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ బ్లాక్‌‌‌‌‌‌‌‌బర్డ్స్‌‌‌‌‌‌‌‌ రేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకీల్ అలీభాయ్ సత్తా చాటుతున్నాడు.  ఫార్ములా4 ఇండియన్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్ తొలి రేసులో అకీల్ రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.  శనివారం  మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ రేసును అతను  27 నిమిషాల 02.059 సెకన్లతో రెండో స్థానంతో ముగించాడు.  బెంగళూరు స్పీడ్‌‌‌‌‌‌‌‌స్టర్స్ డ్రైవర్ జెడెన్ 26 నిమిషాల 57.528 సెకన్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో విజేతగా నిలిచాడు. మరోవైపు ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ మూడో  రౌండ్‌‌‌‌‌‌‌‌ తొలి రేసులో   చెన్నై టర్బో రైడర్స్ డ్రైవర్ జోన్ లాంకాస్టర్‌‌‌‌‌‌‌‌  27 నిమిషాల 11.213సెకన్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో   ట్రోఫీ గెలుచుకున్నాడు.