
చెన్నై: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఫార్ములా4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖీల్ అలీభాయ్ మళ్లీ మెరిశాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ నాలుగో రేసులో విజేతగా నిలిచి ట్రోఫీ గెలిచాడు. ఈ రేసును అలీభాయ్ 27 నిమిషాల 31.329 సెకన్లతో అందరికంటే వేగంగా పూర్తి చేసి అగ్రస్థానం సాధించాడు. అంతకుముందు జరిగిన రెండో రేసులో బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ 28 నిమిషాల 17.475 సెకన్లతో రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచాడు.