- తొలి రౌండ్‌లో హైదరాబాద్ ఫెయిల్
చెన్నై: ఆరు ఫ్రాంచైజీలతో రేసింగ్ అభిమానులను అలరించేందుకు వచ్చిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా మొదలైంది. శనివారం చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై జరిగిన తొలి రౌండ్ పోటీల్లో దేశ, విదేశాలకు చెందిన టాప్ రేసర్లు దూసుకెళ్లారు.
రేసింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఎ-లెవెల్ డ్రైవర్ల కోసం నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) తొలి రౌండ్ రేసులో చెన్నై టర్బో రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోన్ లాంకాస్టర్ (ఇంగ్లండ్) 27 నిమిషాల 15.812 సెకన్లతో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఫార్ములా-4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరు స్పీడ్‌స్టర్స్ డ్రైవర్, ఇండియాకు చెందిన జాడెన్ 27 నిమిషాల 14.967 సెకన్లతో టాప్ ప్లేస్ సాధించాడు. కాగా, ఈ రెండు పోటీల్లోనూ హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు నిరాశపరిచింది. ఎఫ్4 రేసులో బ్లాక్‌బర్డ్స్ రేసర్ హ్యూ బార్టర్ మధ్యలోనే రిటైర్ అవ్వగా.. ఐఆర్‌ఎల్ పోటీలో స్విటర్జాండ్ టాప్ డ్రైవర్ నీల్ జానీ ఏడో స్థానంతో సరిపెట్టాడు.
పాల్గొనే జట్లు
- కోల్‌కతా రాయల్ టైగర్స్ (కోల్‌కతా)
- స్పీడ్ డెమన్స్ ఢిల్లీ (ఢిల్లీ)
- గోవా ఏసెస్ JA రేసింగ్ (గోవా)
- హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (హైదరాబాద్)
- చెన్నై టర్బో రైడర్స్ (చెన్నై)
- బెంగళూరు స్పీడ్‌స్టర్స్ (బెంగళూరు)