
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. ఇండియన్ రైల్వేలో పనిచేయడానికి ఆసక్తి గల వారు ఆన్ లైన్ లో secr.indianrailways.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. 2023-24 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 46 ఖాళీలు భర్తీ చేయబడతాయి. అభ్యర్థులు అర్హత, ఎలా దరకాస్తు చేయాలి, ఇతర వివరాలను secr.indianrailways.gov.in చూడటం ద్వారా తెలుసుకోవచ్చు.