50 రైళ్ల రద్దు..మరికొన్ని దారి మళ్లింపు

50 రైళ్ల రద్దు..మరికొన్ని దారి మళ్లింపు
  • అందుబాటులోకి హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్స్ 

సికింద్రాబాద్, వెలుగు : ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు  దాదాపు 50 రైళ్లను రద్దు చేశారు. మరో 38 రైళ్లను దారి మళ్లించారు. హౌరా–బెంగళూరు, హౌరా–చెన్నై, హౌరా–తిరుపతి, హోరా–సికింద్రాబాద్, హోరా–హైదరాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్–షాలిమార్, వాస్కోడిగామా–షాలిమార్ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–హౌరా ట్రైన్‌‌‌‌‌‌‌‌ను జరోలి మీదుగా, బెంగళూరు–గువాహటి రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా నడుపుతున్నారు. హౌరా–పూరీ, హౌరా–బెంగళూరు, హౌరా–చెన్నై మెయిల్, హౌరా–సంబల్‌‌‌‌‌‌‌‌పూర్, సంత్రగాచి–పూరీ, కన్యాకుమారి–హోరా రైళ్లను రద్దు చేశారు. అలాగే..హౌరా–పూరీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, హౌరా–సర్‌‌‌‌‌‌‌‌ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌,  భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌–హౌరా జన్‌‌‌‌‌‌‌‌శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, హౌరా–భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ జన్​ శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్, పూరీ–హౌరా శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, పూరీ–షాలిమార్‌‌‌‌‌‌‌‌ధౌలీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, పూరి–బంగిరిపోసి, బంగిరిపోసి-పూరి ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌లు రద్దు అయ్యాయి. 

బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

బాధిత ప్రయాణికుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు  దక్షిణ మధ్య రైల్వే వివిధ జంక్షన్లలో హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ–0866 2576924, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 040 27788516  హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి బాధితుల సమాచారాన్ని అందిస్తున్నారు.