రైలు గార్డులు కాదు.. ట్రైన్ మేనేజర్లు

భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో వెనుక బోగీలో ఉండే వ్యక్తిని ఇకపై గార్డులు అని పిలవకూడదని.. ట్రైన్ మేనేజర్లు అని పిలవాలని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు అసిస్టెంట్ గార్డును.. అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్ గా, గూడ్స్ గార్డును గూడ్స్ ట్రైన్ మేనేజర్ గా, సీనియర్ గూడ్స్ గార్డును సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ ప్యాసింజర్ గార్డును సీనియర్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డును మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా మారుస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.

అధికారిక ఆర్డర్ ప్రకారం.. ఆయా ఉద్యోగుల పే స్కేల్, నియామక విధానం, ప్రస్తుత విధులు, బాధ్యతలు, సీనియారిటీ, పదోన్నతులకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది.

 

మరిన్ని వార్తల కోసం..

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం