ట్రైన్‌లో విండోసీట్ బుక్ చేసుకుంటే సీటు ఉంది కానీ.. విండో లేదు

బస్సు లేదా ట్రైన్ లో ప్రమాణం చేసేటప్పుడు విండోసీటులో కుర్చోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఆన్ లైన్ లో  సీటు రిజర్వేషన్ టైంలో కిటికి పక్కన ఉన్న సీటుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఎంతో ఉత్సాహంగా విండో సీటు బుక్ చేసుకుంటే అక్కడ విండో లేని ఘటన ఎప్పుడైనా ఎదురైందా? ఇలాంటి పరిస్థితి ఇండియన్ ట్రైన్ లో ట్రావెల్ చేసిన ఓ ప్యాసింజర్ కు ఎదురైంది. దాన్ని తను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో ఇంటర్నెట్ లో వైరలైంది.

విండోసీటు బుక్ చేసుకుంటే సరిగ్గా రెండు విండోస్ కు మధ్యలో సీటు వచ్చింది. దీన్ని అతను ఫొటో తీసి  ఇండియన్ రైల్వేస్ విండో లేకుండా విండో సీటు ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విండో సీటు రిజర్వ్ చేస్తే చార్జర్ పాయింట్ వచ్చిందని నెటిజెన్లు కామెంట్ చేస్తుంన్నారు. ఎవరో కిటికీని దొంగలించుకెళ్లారని, ఇది ఒకపీడకలని, నీకు అదృష్టం రాసిపెట్టిఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

ALSO READ :- IND vs ENG 5th Test: వీడెవడండీ బాబు.. క్లీన్ బౌల్డ్ అయినా రివ్యూ తీసుకున్నాడు