రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే చోట లభ్యమయ్యేలా స్వరైల్సూపర్ యాప్ పేరుతో ఓ అప్లికేషన్ను కేంద్ర రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా విడుదల చేసింది. ఈ యాప్ను ప్రస్తుతం 1000 మంది యూజర్లు మాత్రమే డౌన్లోడ్చేసుకోగలరు. ప్రజల నుంచి వచ్చే స్పందన, అభిప్రాయాలను అంచనా వేసిన తర్వాత తదుపరి స్పందన కోసం మరో 10,000 మందికి దీనిని అందుబాటులో ఉంచుతారు. దీనిని రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది.
Also Read :- ఐఎన్ఎస్కు వెళ్లనున్న తొలి భారతీయుడు
స్వరైల్ సూపర్ యాప్ ద్వారా ఆన్ లైన్లో ప్రయాణ టిక్కెట్ బుకింగ్లు, క్యాన్సిలేషన్, రైళ్లను ప్రత్యక్షంగా ట్రాకింగ్ చేయడం, రైళ్లలో ఆహార పదార్థాల బుకింగ్, ప్లాట్ఫామ్, పార్సిల్ బుకింగ్లు, రైలు ఎంక్వైరీలు, పీఎన్ఆర్ ఎంక్వైరీలు, రైల్మదద్ద్వారా సహాయం తదితర సేవలు అందుతాయి.