
ఇండియన్ రైల్వే..ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెటవర్క్. వేల ట్రైన్లు. ప్రతి రోజు కోట్లమంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, ఏసీ కార్ చైర్, స్లీపర్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లలో ట్రావెల్ చేసేందుకు వీలు కల్పించింది..వీటిలో ప్రయాణించాలంటే ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి..అయితే వీటిలో జనరల్ బోగీలు కూడా ఉంటాయి మనందరికి తెలుసు. జనరల్ టికెట్ తీసుకోవడం ద్వారా ఏ రైళ్లో అయినా ప్రయాణించవచ్చు. అయితే ఇండియన్ రైల్వే జనరల్ టికెట్లతో ప్రయాణం విషయంలో కొత్త రూల్స్ తీసుకొస్తుంది.
సాధారణంగా జనరల్ టికెట్‌తో ఏ రైలులో అయినా జనరల్ బోగీల్లో ప్రయాణించే వీలుంటుంది. ఇకనుంచి ఈ ఫెసిలిటీ ఉండబోదు. జనరల్ టికెట్ బుకింగ్‌కి సంబం ధించిన రూల్స్ ను మార్చింది రైల్వేశాఖ . ఈ నిర్ణయం అమలులోకి వస్తే జనరల్ టికెట్‌పై సంబంధిత ట్రైన్ పేరు, వివరాలు ఎంటర్ చేస్తారు.
కొత్త రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ తీసుకుంటే.. నిర్దేశించిన బడిన రైలులోనే ప్రయాణించాలి. ఏ రైలు పడితే ఆ రైలులో ప్రయాణించకూడదు. దీంతో పాటు జనర ల్ టికెట్ చెల్లుబాటు కాలం మూడు గంటలకు పరిమితం చేశారు.
ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన రద్దీ ,తొక్కిసలాటల సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటనతో రైల్వేలు కఠినమైన నిబంధనలను అమలు చేశాయి.