- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆర్ఆర్బీ
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వేల్లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,113 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడు దల చేసింది. అందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 3,144, టికెట్ సూపర్వైజర్ 1,736, టైపిస్ట్ 1,507, స్టేషన్ మాస్టర్ 994, సీనియర్ క్లర్క్ పోస్టులు 732 ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18 నుంచి 36 ఏండ్లలోపువారు ఉద్యోగాలకు అర్హులు.
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లెవల్ 1, రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2ను నిర్వహిస్తారు. అనంతరం సిల్క్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.29,900గా నిర్ణయించారు.