దసరాకు గానీ, దీపావళికి గానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఊరెళుతున్నారా..?

దసరాకు గానీ, దీపావళికి గానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఊరెళుతున్నారా..?

ఈ పండుగ సీజన్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా 6556 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సీజన్లో 771 స్పెషల్ ట్రైన్స్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాకపోకలు సాగించనున్నాయి.

పాపులర్ రూట్స్ అయిన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, నాగర్సోల్, మాల్దా టౌన్, గోరక్ పూర్, ధనపూర్, రక్సౌల్, నిజాముద్దీన్, బెర్హంపూర్, హౌరా జంక్షన్లకు స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ కొన్ని రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ కోరారు.

 

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ-– తిరుపతి, తిరుపతి– -కాచిగూడ మధ్య ఏడు చొప్పున, సికింద్రాబాద్– తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ మధ్య 14 చొప్పున సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ– -తిరుపతి మధ్య నడిచే రైలు ఉమ్‌‌‌‌‌‌‌‌దానగర్‌‌‌‌‌‌‌‌, షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, జడ్చర్ల, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వనపర్తి రోడ్, గద్వాల్‌‌‌‌‌‌‌‌, కర్నూల్​సిటీ, డోన్​, గుత్తి, ఎర్రగుంట, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందన్నారు.

ALSO READ | న్యూఢిల్లీ రిచ్చెస్ట్​ రైల్వేస్టేషన్​ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్​

అలాగే సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ – తిరుపతి మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ రైళ్లు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌ 16 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.