పూరి రథయాత్ర..జూలై 6 నుంచి 315 ప్రత్యేక రైళ్లు

పూరి రథయాత్ర..జూలై 6 నుంచి 315 ప్రత్యేక రైళ్లు

ఒడిశాలో జులై  6 నుంచి  19 వరకు జరగనున్న పూరి జగన్నాథ రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు నడపనుంది భారతీయ రైల్వే. ఇటీవల న్యూఢిల్లీలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారులతో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు

ఈ ప్రత్యేక రైళ్లు ఒడిశాలోని పలు ప్రధాన పట్టణాలను కవర్ చేస్తాయి. ఉత్సవాల సందర్భంగా పూరీలో రైల్వేశాఖ తరపున 15 వేల  మంది భక్తులకు వసతి కల్పిస్తామని వైష్ణవ్ హామీ ఇచ్చారు. బదంపహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపూర్  ఇతర ప్రాంతాలతో సహా పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే (ఈస్ట్ కోస్ట్ రైల్వే ) ప్రకటించింది . సంధ్యా దర్శనం, బహుదా జాత్ర, సునా వేషం, రథ జాత్రకు సంబంధించిన అధరాపణ ఆచారాల కోసం ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపింది.