పాలమూరు బిడ్డ నటరాజ్​కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు

పాలమూరు బిడ్డ నటరాజ్​కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు

ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం


న్యూఢిల్లీ, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మూడు దశాబ్దాలుగా సేవకార్యక్రమాలు చేస్తున్న పాలమూరుకు చెందిన డా.నటరాజ్ కు విశిష్ట గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రెండు బంగారు పతకాల్లో ఒకటి నటరాజ్ ను వరించింది. సోమవారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయన ఈ పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. మన సంప్రదాయంలో దాతృత్వం ముఖ్యమైన మానవీయ విలువ అన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సూఖ్​ మాండవీయ, గవర్నర్ తమిళిసై, హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్​నగర్​కు చెందిన నటరాజ్ 1990 నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తున్నారు. కరోనాతో మరణించిన 48 మంది గుర్తు తెలియని వారి అంత్యక్రియలు నిర్వహించారు. కల్యాణి ఫౌండేషన్ పేరుతో పేదలకు బియ్యం.. పప్పుల కిట్స్, వికలాంగులకు ట్రై సైకిల్స్, కాలిబర్స్ ఇస్తున్నారు. పేద విద్యార్థులకు నోటు బుక్కులు పంపిణీ చేస్తున్నారు. 154 సార్లు రక్తదానం చేశారు. పతకం అందుకున్న తర్వాత నటరాజ్ మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న సమాజ సేవకు గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందన్నారు.

ALSO READ :వాన పడితే డేంజర్​గా ఓఆర్ఆర్ అండర్ పాస్​లు