హమాస్ ప్రచారకర్తగా అనుమానం... అమెరికాలో ఇండియన్ రిసర్చర్ అరెస్ట్..

హమాస్ ప్రచారకర్తగా అనుమానం... అమెరికాలో ఇండియన్ రిసర్చర్ అరెస్ట్..

హమాస్ ప్రచారకర్తగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇండియన్ రిసర్చర్ ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేస్తున్న బాదర్ ఖాన్ సూరిని సోమవారం ( మార్చి 17 ) అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వీసా స్వాధీనం చేసుకున్నారు. సూరికి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..

జార్జి టౌన్ యూనివర్సిటీలో ఫారిన్ ఎక్స్చేంజ్ విభాగంలో రీసెర్చ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో హమాస్ ప్రాపగాండాను ప్రచారం చేస్తున్నాడంటూ సూరిపై ఆరోపణలున్నాయి. హమాస్ సీనియర్ అడ్వైజర్ గా ఉన్న టెర్రరిస్ట్ తో సూరికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

బాదర్ ఖాన్ సూరి జార్జి టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేస్తూనే..ఓ కాలేజీలో క్లాసులు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. సూరి.. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏసియాలోని మతపరమైన అమాశాలు, శాంతి అహింస, వంటి అంశాల పట్ల ఆసక్తి చూపినట్లు జార్జి టౌన్ యూనివర్సిటీ వెబ్సైటులో ఉందని తెలిపారు పోలీసులు. ఇటీవలే కొలంబియాలో రజని శ్రీనివాసన్ అనే 37 ఏళ్ళ ఇండియన్ పోస్ట్ డాక్టోరల్ స్టూడెంట్ పై పాలస్తీనా నిరసనలో పాల్గొన్నందుకు నిషేధం విధించిన కొద్దిరోజులకే బాదర్ ఖాన్ సూరి అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.