Rupee value: మరింత డీలా పడ్డ రూపాయి.. కారణం ఇదే

Rupee value: మరింత డీలా పడ్డ రూపాయి.. కారణం ఇదే

రూపాయి విలువ మరోసారి దిగజారింది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. గురువారం (జనవరి 1,2025) నాడు మార్కెట్​ ముగిసే సమయానికి రూ. 85.78 వద్ద ట్రేడవుతోంది. మునుపటి ముగింపులోరూ. 85.64 ఉన్న రూపాయి విలువ 14 పైసలు బలహీనపడింది. కరెన్సీ వరుసగా 85.7875 , 85.6925 గరిష్ట ,కనిష్ట స్థాయిలను తాకింది. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం, US డాలర్ ఇండెక్స్‌లో గణనీయమైన పెరుగుదలతో 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు రూపాయి సెంటిమెంట్‌లను దెబ్బతీశాయి. 

మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం నికర ప్రాతిపదికన క్యాపిటల్ మార్కెట్లలో రూ.1,782.71 కోట్లను ఆఫ్‌లోడ్ చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది. డిసెంబర్‌లో GST ఆదాయం 7.3శాతం వృద్ధి చెంది రూ. 1.77 లక్షల కోట్లకు చేరుకుంది.  2023లో ఇదే నెలలో రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అదే నెలవారీగా 2.97శాతం క్షీణించింది.