హైదరాబాద్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి "వన్ 8 కమ్యూన్" రెస్టారెంట్ ఉంది. విరాట్ కోహ్లీ బ్రాండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి తగ్గట్టు అతని రెస్టారెంట్ లో ధరలు భారీగా ఉంటాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి హైదరాబాద్‌లోని (వన్ 8 కమ్యూన్) విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో మొక్కజొన్న ముక్కలను ఆర్డర్ చేసి షాక్ కు గురైంది. ఈ మొక్క జొన్న ధర అక్షరాలా రూ.525 కావడంతో ఆమె షాక్ కు గురైంది.
మొక్కజొన్న ధరపై తన నిరాశను వ్యక్తం చేస్తూ ఎక్స్ లో విద్యార్థిని స్నేహ ఇలా రాసింది " “ఈ రోజు One8 కమ్యూన్‌లో దీని కోసం రూ. 525 చెల్లించాను". అని షేర్ చేసింది. స్నేహ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ డిష్ లో మొక్కజొన్న తో పాటు కొత్తిమీర ఆకులు, చుట్టూ నిమ్మకాయలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె ట్వీట్ పై భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ధర చాలా ఎక్కువ ఇది అన్యాయమని భావిస్తుంటే.. మరికొందరు ఇలాంటి రెస్టారెంట్ లో చాలా సహజమని చెబుతున్నారు.
ALSO READ | రూ.500 కోట్లు సేకరించిన వీవర్క్
వన్ 8కమ్యూన్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూలు ఉన్నట్టు తెలుస్తుంది. కోహ్లీకి హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు, ముంబయి, పుణే, కోల్ కతా,ఢిల్లీలో రెస్టారెంట్ లు నడిపిస్తున్నాడు. కోహ్లీకి హైదరాబాద్ బిర్యానితో పాటు మష్రూమ్ డిమ్ సమ్ అతడికి ఇష్టమని గతంలో చెప్పాడు. కోహ్లీ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ త్వరలో రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు కీలకం కానుంది. ఒకవేళ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో కనబడే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది.