
చాంగ్వాన్: ఇండియా షూటర్ జాహిద్ హుస్సేన్.. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆదివారం జరిగిన మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో జాహిద్ 624.5 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. మలినోవిస్కి కాన్‌స్టాంటిన్ (625.6) స్వర్ణం, డు లిన్ష్ (624.3) బ్రాంజ్ గెలిచారు. టీమ్ విభాగంలో ఇండియా ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.
జాహిద్–రామన్ శేఖర్–అతుల్ కుమార్ త్రయం 1850.7 పాయింట్లు సాధించింది. విమెన్స్ కేటగిరీలో దూది మోనికా–రుచిరా అరుణ్–స్వాతి 1832.9 పాయింట్లతో ఆరో ప్లేస్‌తో సంతృప్తి పడింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ విభాగంలో ఫర్హాన్ మీర్జా–పుక్‌రాజ్ చౌహాన్–పర్వేజ్ అబ్దుల్లా 1829.6 పాయింట్లతో థర్డ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.