హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–300 టోర్నీ ఫైనల్లో మాళవిక

హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–300 టోర్నీ ఫైనల్లో మాళవిక

సారాబ్రూకెన్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) : ఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌ మాళవిక బన్సోద్‌‌‌‌‌‌‌‌.. హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–300 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ మాళవిక 23–21, 21–18తో జూలీ దావల్‌‌‌‌‌‌‌‌ జాకోబ్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గింది.

44 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్ ర్యాలీలు, స్మాష్‌‌‌‌‌‌‌‌లతో ఆకట్టుకుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌  సింగిల్స్ సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆయూష్‌‌‌‌‌‌‌‌ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడాడు.