చికున్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గున్యా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఆటకు ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చికున్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గున్యా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఆటకు ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఇండియా సీనియర్ షట్లర్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటకు కొంతకాలం విరామం ఇస్తున్నట్టు ప్రకటించాడు. చికున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గున్యా  కారణంగా పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిరాశ పరిచిన ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ వ్యాధి ప్రభావాలతో  తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపాడు. దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు రాబోయే కొన్ని టోర్నీలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు. ‘చికున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గున్యా నా శరీరంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. తరచూ వస్తున్న ఒళ్లు నొప్పుల కారణంగా  నా అత్యుత్తమ స్థాయిలో ఆడటం సాధ్యం అవ్వడం లేదు. 

నా బృందంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత  కోలుకోవడంపై దృష్టి పెట్టడానికి రాబోయే కొన్ని టోర్నమెంట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.  నేను బలంగా తిరిగి వస్తా’ అని ప్రణయ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అయితే, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది? ఏయే టోర్నీల నుంచి తప్పుకున్న వివరాలను అతను వెల్లడించలేదు. నా పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తోటి ఆటగాడు లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు.