కరోనా ఎఫెక్ట్..ఆల్ ఇంగ్లాండ్ ఆడమన్నభారత షట్లర్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో ఇండియాకు చెందిన పలువురు బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు  ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు మెగా టోర్నీ నుంచి తమ ఎంట్రీని విత్‌ డ్రా చేసుకుంటున్నామని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బాయ్‌)కు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. విత్‌ డ్రా చేసుకున్న వారిలో డబుల్స్‌ స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టితో పాటు సీనియర్‌ ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ, మను అత్రి,సుమిత్‌ రెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని బాయ్‌ సెక్రటరీ అజయ్‌ సింఘానియా ధ్రువీకరిం చారు. అయితే సైనా, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌,అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి , ప్రణవ్‌ జెర్రీ చొప్రా మాత్రం బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు. టోక్యో ఒలింపిక్స్‌ క్ వాలిఫికేషన్‌కు కీలకమైన ఆల్‌ ఇంగ్లండ్‌ ఈ నెల 11 నుంచి జరుగుతుంది.

ఆసియా కప్ ఆర్చరీకి ఇండియా దూరం కరోనా ఎఫెక్ట్​తో బ్యాంకాకాక్​లో జరిగే ఆసియా కప్ ​వరల్డ్​ ర్యాంకింగ్ టోర్నమెంట్​ నుంచి ఇండియా ఆర్చరీ టీమ్​ వైదొలిగింది. ఈ నెల 8 నుంచి 15 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొన బోమని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ​ఇండియా (ఏఏఐ) గురువారం స్పష్టం చేసింది. ఐదు నెలల సస్పెన్షన్​  అనంతరం ఆడాల్సి న తొలి టోర్నీ నుంచే ఇండియా ఆర్చరీ జట్టు వైదొలిగింది. ప్లేయర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి రిస్క్​ తీసుకోదల్చుకోలేదని ఏఏఐ సెక్రటరీ గుంజన్ అబ్రోల్ చెప్పారు. ఫిఫా వరల్డ్‌ , ఆసియా క్వాలిఫయర్స్‌‌ వాయిదాకరోనా వ్యాప్తి నేపథ్యం లో 2022 సాకర్‌ వరల్డ్‌ క-ప్‌ , 2023 ఆసియా కప్‌ క్ వాలిఫయర్స్‌‌ మ్యాచ్‌ లను వాయిదా వేస్తున్నట్టు ఫిపా తెలిపిం ది. మ్యాచ్‌ లను తిరిగి ఎప్పుడు నిర్వహిం చేది రాబోయే రోజుల్లో చె-బుతామని వెల్లడించిం ది. వరల్డ్‌ కప్‌ రేసు నుంచివైదొలిగిన ఇండియా భువనేశ్వర్‌ లో ఈ నెల 26నఖతార్‌ , జూన్‌ లో బంగ్లాదేశ్‌ , అఫ్గానిస్థాన్‌ తో పోటీపడాల్సి ఉంది.