ఇస్రోలో ఉద్యోగాలు..అప్లయ్ చేసుకోండిలా

ఇస్రోలో ఉద్యోగాలు..అప్లయ్ చేసుకోండిలా

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO)లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్( NRSC) సంస్థలోని 54 టెక్నిషీయన్ బీ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ధరఖా స్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 31 సాయంత్రం 5.00 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ nrsc.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీలు:     1. డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ -2 పోస్టులు 
                     2. ఎలక్ట్రానిక్ మెకానిక్ - 33 పోస్టులు 
                     3. ఎలక్ట్రీషియన్ -8 పోస్టులు  
అర్హత : 

వయోపరిమితి: డిసెంబర్ 31 , 2023 నాటికి 18 నుంచి 35 మధ్య వయస్సు ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. 

విద్యార్హత: సంబంధిత ట్రేడ్ లో ITI/NCVT సర్టిఫికెట్ తో 10 వ తరగతి హైస్కూల్ పరీక్ష పాస్ అయి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్ఖులు దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు తదుపరి దశలలో దరఖాస్తు ఫీజు  పూర్తిగా రీఫండబుల్.

అప్లయ్ చేయండిలా

    1.  అధికారిక వెబ్ సైట్ nrsc.gov.in ని సందర్శించాలి 
    2. హోమ్ పేజీలో Careers ట్యాప్ పై క్లిక్ చేయాలి 
    3. తర్వాత Apply Online పై క్లిక్ చేయాలి 
    4. ప్రకటన నం. NRSC/RMT/42023 కోసం అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
    5. స్వయంగా దరఖాస్తును నింపండి. 
    6. ఫారమ్ ను పూరించి ఫీజు చెల్లించి సబ్ మిట్ చేయాలి. 
    7. భవిష్యత్ సూచన కోసం కాపీని డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.