- ప్రాజెక్టుకు ‘లూనార్ పోలార్ ఎక్స్ప్లొరేషన్ మిషన్’ గా పేరు
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తర్వాతి మూన్ మిషన్‌ను జపాన్‌తో కలిసి చేపట్టనుంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ (జాక్సా), ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాయి. దీనికి ‘లూనార్ పోలార్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్’(లూపెక్స్) గా పేరుపెట్టారు. మూన్ మిషన్ కు సంబంధించి రోవర్‌ను జాక్సా డెవలప్ చేయనుండగా.. ల్యాండర్‌ను ఇస్రో అభివృద్ధి చేయనుంది.
రోవర్లో ఇస్రో, జాక్సాకు చెందిన పరికరాలు మాత్రమే కాకుండా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ స్ట్రుమెంట్లు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టు పనులపై జపాన్ నేషనల్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ డైరెక్టర్ జనరల్ సకు సునేత ఈ నెల ఆరంభంలోనే బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శిం చారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌తో మూన్ మిషన్ లూపెక్స్ పై చర్చలు జరిపారని ఇస్రో అధికారులు తెలిపారు.
చంద్రుడి ధ్రువ ప్రాంతంలో ఒక బేస్ ను ఏర్పాటు చేయడం, నీటి వనరుల జాడను కనుగొనడం లూపెక్స్ ప్రాజెక్టు ఉద్దేశమని జాక్సా తెలిపింది.