బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన స్పేడెక్స్ మరోసారి వాయిదా పడింది. అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానించే ఈ ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు డాకింగ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల చేపట్టిన స్పేడెక్స్ ప్రాజెక్టులో భాగంగా పీఎస్ఎల్వీ రాకెట్ ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. కక్ష్యలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను ఈ నెల 7న డాకింగ్ చేయాలని ఇస్రో ముందు గా నిర్ణయించింది.
అయితే, అనుకోని అవాంతరాల కారణంగా డాకింగ్ ప్రక్రియను గురువారం ఉదయానికి వాయిదా వేసింది. తాజాగా ఆ ప్రక్రియ ను మరోసారి వాయిదా వేస్తున్నట్లు బుధవారం రాత్రి ఇస్రో ట్వీట్ చేసింది.
శాటిలైట్లు చక్కగా పనిచేస్తున్నాయని, రెండింటి మధ్య మలుపు అంచనాలకు మించి ఉండడంతో డాకింగ్‌ను వాయిదా వేశామని పేర్కొంది.