Team India: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకం మొదలు: వన్డే సిరీస్ కోసం నాగ్‌పూర్‌ చేరుకున్న టీమిండియా

Team India: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకం మొదలు: వన్డే సిరీస్ కోసం నాగ్‌పూర్‌ చేరుకున్న టీమిండియా

ఇంగ్లాండ్ తో ధనాధన్ టీ20 సిరీస్ ను 4-1 తేడాతో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో భారత జట్టు ఆదివారం (ఫిబ్రవరి 2) రాత్రి నాగ్‌పూర్‌కు చేరుకుంది. ముందుగా ఎయిర్ పోర్ట్ లోకి కోహ్లీ రాగానే ఫ్యాన్స్ కేకేలు పెట్టారు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. 2024 లో ఆగస్టు లో శ్రీలంకపై వన్డే మూడు వన్డేల సిరీస్ తర్వాత తొలిసారి భారత్ తొలిసారి ఆడుతున్న వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.   

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌తో సహా స్టార్ ప్లేయర్‌లు నేరుగా తమ జట్టు హోటల్‌కు వెళ్లే ముందు నాగ్‌పూర్ విమానాశ్రయంలో కనిపించారు. నేటి నుంచి ప్రాక్టీస్‌ సెషన్స్‌ ప్రారంభించేందుకు జట్టు సిద్ధమైంది. ఈ టోర్నీలో బాగా రాణించి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే, భారత పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా మొదటి రెండు వన్డేలకు దూరమవుతాడు. 

ALSO READ : IND vs ENG: అభిషేక్ మెంటల్ నా.. ధనాధన్ ఇన్నింగ్స్‌పై నితీష్ కామెంట్స్ వైరల్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్),శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య,అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, మహ్మద్ షమీ, ఆర్షదీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్, రవీంద్ర జడేజా