బ్రాంజ్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టిన శౌర్య

బ్రాంజ్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టిన శౌర్య

న్యూఢిల్లీ : ఇండియా స్క్వాష్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ శౌర్య బవా.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ స్క్వాష్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. బుధవారం జరిగిన బాయ్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో శౌర్య 0–3 (5–11, 5–11, 9–11)తో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ జకారియా (ఈజిప్టు) చేతిలో ఓడాడు. 41 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ స్థాయి మేరకు రాణించలేకపోయాడు.

గతేడాది ఇదే టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన జకారియా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాడు. ఇండియా నుంచి కుష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (2014) తర్వాత వరల్డ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరిన రెండో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా బవా రికార్డులకెక్కాడు.