
న్యూఢిల్లీ: ఇండియా స్క్వాష్ ప్లేయర్ శౌర్య బవా వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శౌర్య 3–2తో మలేసియా ఆటగాడు లో వా సెర్న్‌పై పోరాడి విజయం సాధించాడు. దాంతో కుష్ కుమార్ (2014లో) తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన రెండో ఇండియన్‌గా నిలిచాడు. కాగా విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో 16 ఏండ్ల అనాహత్ సింగ్ 2–3తో నడియెన్ (ఈజిప్ట్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.