రాహుల్ గాంధీపై కేసు..బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను విమర్శించినందుకేనా?

రాహుల్ గాంధీపై కేసు..బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను విమర్శించినందుకేనా?

గువాహటి: బీజేపీ, ఆర్ఎస్ఎస్​లతో పాటు ఇండియన్​ స్టేట్​తో ఫైట్​ చేస్తున్నమంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గువాహటిలో కేసు నమోదైంది. మోన్​జిత్ చేతియా అనే వ్యక్తి ఫిర్యాదుతో పాన్  బజార్ పోలీసులు రాహుల్ పై ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. 

భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు రిజిస్టర్  చేశారు. ఈనెల 15న ఢిల్లీలో కాంగ్రెస్  పార్టీ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్  మాట్లాడుతూ బీజేపీపైనా, ఆర్ఎస్ఎస్  చీఫ్​ మోహన్  భగవత్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చేతియా ఫిర్యాదు చేశారు. 

కాగా.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అంతకుముందు భగవత్  చేసిన వ్యాఖ్యలను రాహుల్  తప్పుపట్టారు.