స్టాక్ మార్కెట్ @ లక్ష పాయింట్లు: 2025లోనే రీచ్ అవుతుందని అంచనా

స్టాక్ మార్కెట్ @ లక్ష పాయింట్లు: 2025లోనే రీచ్ అవుతుందని అంచనా

ముంబై: సెన్సెక్స్ గురు వారం (సెప్టెంబర్ 26, 2024) తొలిసారిగా చారిత్రాత్మక 85,836.12 పాయింట్ల స్థాయిని తాకింది. నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయికి చేరుకుంది. 211.90 పాయింట్లతో మొదలై 26,216.05 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. 2025లోనే సెన్సెక్స్ లక్ష పాయింట్లకు చేరుకుంటుందని ఈ వృద్ధిని గమనించిన మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. 2025 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ లక్ష మార్క్ రీచ్ అవ్వొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గోల్డెన్ లెవెల్ రీచ్ కావడానికి కేవలం 15 వేల పాయింట్ల దూరంలోనే సెన్సెక్స్ ఉండటం గమనార్హం.

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో వృద్ధి చెందుతూ దూసుకెళుతుండటానికి యూఎస్​ఫెడ్ వడ్డీ​రేట్లు మరింత తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్లలో ఆశావాదాన్ని పెంచడం ప్రధాన కారణంగా తెలిసింది. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. 2024 చివరి లోపు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని, వచ్చే ఏడాది  ఒక శాతం తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 లో  మరో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించొచ్చని చెబుతున్నారు.

ALSO READ | వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటలిస్టుల ఐపీఓల బాట

గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ,  విదేశీ నిధుల ప్రవాహం, కొనుగోళ్ల వల్ల కూడా ఇండెక్స్లు రికార్డు స్థాయిలకు దూసుకెళ్లాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రోజురోజుకు వృద్ధిని సాధిస్తున్నాయి. దాదాపు 16 శాతం సంపదతో సీఏజీఆర్ దేశీయ మార్కెట్ సూచీలకు అండగా నిలబడుతున్నాయి. అందుకు నిదర్శనం గత 45 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపు 850 రెట్ల ఎక్కువ రాబడి అందబోతోంది.

ALSO READ | ఇండియాలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 స్టార్టప్‌‌‌‌‌‌‌‌ జెప్టో

అంటే 1979 ఏప్రిల్లో సెన్సెక్స్ ప్రారంభంలో రూ. లక్షతో పెట్టుబడి పెట్టివారు ఇప్పుడు దాదాపు 8.5 కోట్లకు సమానం అవుతుంది. ఈ వారంలోనే 85000 పాయింట్ల మార్క్ ను దాటిన మార్కెట్ సూచీలు, త్వరలోనే లక్ష పాయింట్ల మార్కుకు చేరువయ్యేలా దూసుకెళ్తున్నాయి. మార్కెట్ల జోరు ఇలానే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఘనతను సాధించవచ్చని మార్కెట్ విశ్లేషకులు ఆశిస్తున్నారు. సీఏజీఆర్ వృద్ది రేటు 16 శాతంతో ఇలానే కొనసాగితే డిసెంబర్ 2025 నాటికే సెన్సె్క్స్ ఆ మార్కును చేరుకోవచ్చు.