అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పొరుగు దేశాలపై వాణిజ్య సుంకం విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఇన్వెస్టర్లు అచితూచీ వ్యవహరించడంతో భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ ఇండెక్స్, సెన్సెక్స్ 2025, జనవరి 21 మంగళవారం భారీగా పతనమైంది. మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్‌గా స్టార్ట్ అయినప్పటికీ.. ఏషియన్ మార్కెట్స్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, ప్రతికూలతలు, పెట్టుబడిదారులు అమెరికా వైపు ఆసక్తి చూపడం కారణంగా ఇండియన్ మార్కెట్స్పై బేర్స్ పంజా విసిరింది.
మంగళవారం సెన్సెక్స్ 1,235 పాయింట్లు కోల్పోయి 75,838 వద్ద ముగియగా.. నిఫ్టీ 50 క్లోజింగ్ సమయానికి 320 పాయింట్లు నష్టపోయి 23,024కి పడిపోయింది. ఈక్విటీ మార్కెట్లపై బేర్స్ పంజా విసరడంతో మంగళవారం (జనవరి 21) ఒక్కరోజే రూ. 7.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. ఈరోజు ఫాల్లో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్స్ (ప్రభుత్వ రంగ బ్యాంకులు), మెటల్స్‌లో ఫాల్ ఎక్కువగా కనబడింది. నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఎనర్జీ, ఇన్ఫ్రా, ఐటీ స్టాక్స్‌లో ఈ ప్రభావం కనిపించింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో అపోలో హాస్పిటల్స్, టాటా మోటర్స్, టాటా కన్జూమర్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా..అదానీ ఎన్ టర్ ప్రైజెస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రెట్ అందానీ పోర్ట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్ ఫాల్‌కు కారణం:
యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ లోకి వెళ్లిపోయాయి. అమెరికా ఎకానమీ బలపడేందుకు ట్రంప్ ప్రభుత్వం పాలసీ నిర్ణయాలు తీసుకుంటుందని ఇన్వెస్టర్లు భావించడమే అందుకు కారణం. యూఎస్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చేలా పాలసీ డెసిషన్స్ ఉంటాయని ఇన్వెస్టర్లు భావించి యూఎస్ మార్కెట్స్ పై పాజిటివ్ దృక్పథం పెరగడంతో అమెరికా సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఫారెన్ ఇన్వెస్టర్లు యూఎస్ మార్కెట్స్ పై ఆసక్తితో ఉండట ఇండియన్ మార్కెట్స్ పై నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది.
Also Read :- ఇండియన్ మార్కెట్స్పై ట్రంప్ ఎఫెక్ట్ ఎంత..?
ట్రంప్ ప్రభావం- టారిఫ్ భయాలు:
యూఎస్ అధ్యక్షునిగా ఎన్నికలైన ట్రంప్ మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై ఫిబ్రవరీ 21 నుంచి 25 శాతం టారిఫ్ లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభావంతో మెక్సికో సూచీలు 1.1 శాతం పతనం అయ్యాయి. అదే విధంగా కెనెడియన్ డాలర్ కూడా పతనం అయ్యింది. మెక్సికో, కెనడాలపై విధించే టారిఫ్ తో ఏషియన్ మార్కెట్స్ లో భయాందోళనలు మొదలయ్యాయి. టారిఫ్ పెంపుతో ప్రపంచ వాణిజ్యంలో అంతరాయం ఏర్పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రభావంతో కూడా మంగళవారం ఇండియన్ మార్కెట్స్ ఫాల్ అయ్యాయి.
యూఎస్ పాలసీ లో అనిశ్చిత్తి:
ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డర్స్ ను వెనక్కు తీసుకోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం.. అదే విధంగా ఇతర అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను వెనక్కి తీసుకోవడంతో ఏషియన్ మార్కెట్స్ నెగెటివ్ గా టర్న్ అయ్యాయి. అనూహ్యంగా పాలసీలను మార్చడం, వివిధ ఒప్పందాలను, ఆర్డర్స్ ను రద్దు చేసుకోవడంపై మార్కెట్లు నెగెటివ్ తీసుకుంటాయి. ప్రస్తుత అనిశ్చిత్తి కారణంగా మార్కెట్స్ లో ఫాల్ మొదలయ్యింది. త్వరలో వచ్చే యూఎస్ ఫెడరల్ పాలసీ పైనే మార్కెట్ల భవితవ్యం ఆధారపడి ఉంది
డాలర్ పెరగటం.. రూపాయి క్షీణించడం:
ఇండియన్ మార్కెట్స్ పతనానికి కారణం డాలర్ పెరుగుదల కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. డాలర్ పెరగడంతో ఇండియన్ రూపీ హిస్టారికల్ గా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో డాలర్ పైన పెట్టుబడులు పెరుగుతుండటం ఇండియన్ మార్కెట్స్ పై నెగెటివ్ ప్రభావం చూపిస్తోంది.