Sensex Crash: 3వేల పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ కల్లోలం..

Sensex Crash: 3వేల పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ కల్లోలం..

Markets Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత ట్రేడ్ టారిఫ్స్ భయంతో అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కుప్పకూలాయి. అమెరికా, ఆసియా, హాంకాంగ్ సహా ఇతర మార్కెట్లు ప్రస్తుతం భారీ పతనాన్ని చూసిన వేళ భారత మార్కెట్లలో కూడా ప్రతికూల సెంటిమెంట్లు ట్రిగర్ అయ్యాయి. దీంతో నేడు బెంచ్ మార్క్ సూచీలు పెద్ద పతనాన్ని నమోదు చేశాయి.

కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్ద పతనంతో స్టార్ట్ చేయటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయం 9.45 గంటల సమయంలో 2వేల 800 పాయింట్ల పతనంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 900 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ వెయ్యి590 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2వేల 340 పాయింట్ల పతనంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా విక్స్ సూచీ అత్యధికంగా ఒక్కరోజులోనే 55 శాతం భారీ పెరుగుదలను నమోదు చేసింది. 

అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కఠిన సుంకాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు అమెరికాతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఈ భయాలతో సోమవారం మార్కెట్లు భారీగా పతనం కావటంతో నిఫ్టీ సూచీ తన 10 నెలల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం ఎర్లీ ట్రేడ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 3వేల 900 పాయింట్ల పతనాన్ని నమోదు చేయటం గమనార్హం. ఈ పరిస్థితులపై దేశీయ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభ సమయంలో ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ వాట్ వ్యూహాన్ని ఫాలో అవటం అత్యంత వివేకవంతమైనదిగా అభిప్రాయపడ్డారు. 

ఐటీ స్టాక్స్ పరిస్థితి ఏంటి..?
ఒక పక్క అమెరికా టారిఫ్స్ మరోపక్క రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతికూల సెంటిమెంట్లు ట్రిగర్ కావటంతో నేడు నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 7 శాతం పతనాన్ని చూసింది. ప్రధానంగా అమెరికా మార్కెట్లపై ఆధారపడిన ఐటీ సేవల కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ స్టాక్స్ భారీగా ఇంట్రాడేలో నష్టాలను చూశాయి. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ టెక్ కంపెనీలైన ఎంఫసిస్, కొఫొర్జీలు కూడా 9 శాతం వరకు పతనాన్ని చూశాయి. ప్రస్తుత టారిఫ్స్ కారణంగా అమెరికా కస్టమర్ల నుంచి దేశీయ టెక్ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను గెలుచుకోవటం నెమ్మదిస్తుందని, ఇది కంపెనీల టాప్ లైన్ దెబ్బతీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఐటీ స్టాక్స్ పతనానికి కారణమైంది.