Bull Markets: ట్రంప్ మాటలతో గ్లోబల్ మార్కెట్స్ సెట్ రైట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..

Bull Markets: ట్రంప్ మాటలతో గ్లోబల్ మార్కెట్స్ సెట్ రైట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..

Stock Markets: సోమవారం నాడు ట్రంప్ టారిఫ్స్ భయాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్స్ కూడా భారీ పతనాన్ని చూడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.16 లక్షల కోట్ల మేర ఆవిరైన సంగతి తెలిసిందే. అయితే నేడు మార్కెట్లు ఇంట్రాడేలో ఏకంగా 11వందల పాయింట్ల మెగా పెరుగుదలను నమోదు చేశాయి.

ఈ క్రమంలో ఉదయం 10.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెస్సెక్స్ 346 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 227 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 425 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో నిన్నటి నష్టాల నుంచి దాదాపుగా అన్ని రంగాలు లాభాల్లోకి అడుగుపెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు తిరిగి గాడిన పడటానికి కారణం ట్రంప్ నిన్న చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికాలో ఎలాంటి ద్రవ్యోల్బణం లేదన్న ట్రంప్.. చైనాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రంప్ చైనాపై ఎక్కువగా దృష్టి కొనసాగిస్తున్న వేళ ఇతర గ్లోబల్ మార్కెట్లలో భయాలు తొలగాయి.

ఇప్పటికే ఇండియా అమెరికాతో ఇటీవలి ట్రేడ్ టారిఫ్స్ విషయంలో చర్చలు జరుపుతోంది. ఇద్దరికీ అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని తీసుకురావటానికి ప్రస్తుత చర్చలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు ఇంట్రాడేలో పెట్టుబడిదారులు పెరిగిన మార్కెట్ల నుంచి లాభాల స్వీకరణకు మెుగ్గుచూపడంతో దాదాపు సెన్సెక్స్ 900 పాయింట్లు తగ్గుదలను చూసింది. అయితే మెటల్స్ రంగంలోని కంపెనీలు మాత్రం తిరిగి ఊపిరిపోసుకోలేదు. 

►ALSO READ | Gold Rate: దిగొస్తున్న పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజూ ఢమాల్, హైదరాబాద్ రేట్లిలా..

ట్రంప్ తీసుకున్న చర్యల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగొచ్చని జేపీ మోర్గన్ సీఈవో డిమోన్ హెచ్చరించారు. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరో పక్క అమెరికాలోని వ్యాపారవేత్తలు సైతం ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఆర్థిక వేత్త కాదని, ఆయన తీసుకున్న టారిఫ్స్ అమెరికా వ్యాపారాలతో పాటు అక్కడి ప్రజలు సైతం ప్రతికూల పరిస్థితులను చూస్తారని ట్రంప్ మద్దతుదారు, సంపన్నుడు బిల్ అక్మెన్ పేర్కొన్నారు. ఈ విధ్వంసం నుంచి అమెరికాకు తేరుకోవటానికి అనేక దశాబ్ధాలు పట్టొచ్చన్నారు.