
Stock Markets: వరసగా 5వ నెల కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నష్టాలతో ముగించాయి. 2025 ఫిబ్రవరి భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 1996 తర్వాత దీర్ఘకాలికంగా కొనసాగిన మార్కెట్ నష్టాలతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 2025, ఫిబ్రవరి 28, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు 1,400 పాయింట్ల భారీ నష్టంతో ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల సంపదను మింగేసింది.
వాస్తవానికి ఈ పరిస్థితులకు కారణాలను పరిశీలిస్తే ముందుగా ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు భారత ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీశాయని వెల్లడైంది. ఈ పరిస్థితులను చూస్తుంటే భారతీయ మార్కెట్లలో పతనం మరికొన్ని రోజులు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. అంచనాల కంటే దిగువన ఉండటంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు యూఎస్ టారిఫ్స్ భయాలతో తమ డబ్బును వెనక్కి తీసుకోవటాన్ని వేగవంతం చేయటం వంటివి ఉన్నాయి. ఇదే క్రమంలో బలపడుతున్న డాలర్.. రూపాయి మారకపు విలువను పతనం చేస్తూ విదేశీ ఇన్వెస్టర్లలో రాబడులపై ఆందోళనలను పెంచుతోంది.
ALSO READ : సిటీ బ్యాంక్ బిగ్ మిస్టేక్: జర్రుంటే రూ.6,723 లక్షల కోట్లు ఖతం అయ్యేవి
2024 సెప్టెంబరులో గరిష్ఠాల నుంచి ప్రస్తుతం నిఫ్టీ దాదాపు 15 శాతం కరెక్షన్ చూసింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు 85 ట్రిలియన్ రూపాయల సంపద నష్టం జరిగింది. ఇలాంటి సమయంలో ట్రంప్ తన రెసిప్రొకేటివ్ టారిఫ్స్ ఇండియాపై విధించటం మెుదలెడితే,, పరిస్థితులు మరింత కాలం దిగజారే అవకాశం ఉందని పెట్టుబడిదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రతినిధి మహేష్ పటేల్ వెల్లడించారు. బలమైన రిటైల్ ఆసక్తి కారణంగా స్థానిక సంస్థాగత పెట్టుబడిదారులు నికర కొనుగోలుదారులుగా ఉన్నారని.. కానీ పెట్టుబడులు మందగించాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీఈవో ప్రతీక్ గుప్తా అంటున్నారు.
మార్కెట్లకు కొత్త ఆందోళనలు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా-, ఉక్రెయిన్ మధ్య శాంతియుత వాతావరణాన్ని స్థాపించటానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలోనే.. మీడియా వేదికగా ట్రంప్ కు.. జెలెన్ స్కీ ఝలక్ ఇచ్చారు. తమకు యుద్ధం ఆగటం ఇష్టమే అన్న జెలెన్ స్కీ.. విలువైన ఖనిజాలను తవ్వటానికి అమెరికాకు అనుమతించటానికి కూడా ఒప్పుకున్నప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా తమకు హామీ కావాలని, ఆ దిశగా అమెరికా నుంచి రక్షణాత్మక చర్యలకు పట్టుబట్టారు. ఇది ట్రంప్ కి ఆగ్రహాన్ని తెప్పించింది. మెుత్తానికి పరిష్కారం ఓ కొలిక్కి రాకపోవటంతో ఉద్రిక్తతలు మరింత కాలం కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే మళ్లీ మార్కెట్లలో ఆ మేరకు అలజడి కొనసాగుతుందని వారు చెబుతున్నారు. 2025, మార్చి 3వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది పెట్టుబడిదారుల్లో టెన్షన్ పెట్టిస్తోంది.
ALSO READ : ‘‘తిక్కకుదిరింది’’.. ట్రంప్, జెలెన్ స్కీ వాగ్వాదంపై రష్యా స్పందన
ఈ పరిస్థితుల్లో అమెరికా భావించినంత సులువుగా.. జెలెన్ స్కీ లొంగే పరిస్థితులు కనిపించటం లేదు. ఇది ప్రపంచ మార్కెట్లలోని ఇన్వెస్టర్లకు మరికొంత కాలం నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులను కలిగించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే భారతీయ మార్కెట్లకు బలంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేత పేర్కొనబడిన రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తతతో దూరంగా ఉంటున్నారు. చాలా మంది తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను సైతం నిలిపివేసినట్లు ఇటీవలి డేటా ప్రకారం వెల్లడైంది.