స్కాట్లాండ్‎లో భారత విద్యార్థిని మృతి

 స్కాట్లాండ్‎లో భారత విద్యార్థిని మృతి

లండన్: స్కాట్లాండ్‎లో ఇటీవల అదృశ్యమైన భారతీయ విద్యార్థిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృతదేహం లభించినట్టు స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. గుర్తించడానికి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని చెప్పారు. కేరళ ఎర్నాకులంలోని పెరుంబవూరుకు చెందిన సాండ్రా సాజు (22) ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లింది. ఎడిన్ బర్గ్​లో హెరియట్ వాట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. గైల్ ప్రాంతంలో  డిసెంబర్ 6న సాండ్రా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. చివరకు ఆల్మండ్ నదిలో సాండ్రా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.