జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ అనే భారతీయ విద్యార్థి ఇటలీలో మరణించాడు. అతను జనవరి 2న మరణించినట్టు పోలీసులు తెలిపారు. రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వెళ్లి అద్దెకు ఉంటున్నాడని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రౌత్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అతను వారి కాల్ లిఫ్ట్ చేయలేదని, రౌత్ తల్లిదండ్రులు అతని ఇంటి యజమానిని సంప్రదించగా, రౌత్ మరొకరి ఇంట్లో వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడని వారికి తెలియజేశారు.
అతని మరణం గురించి తెలుసుకున్న రామ్ రౌత్ కుటుంబం అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి జార్ఖండ్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులను సంప్రదించింది. ఈ సంఘటనపై వెస్ట్ సింగ్‌భూమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ స్పందిస్తూ.. రామ్ రౌత్ మరణం గురించి తనకు సమాచారం అందిందని, అవసరమైన చర్యల కోసం హోం శాఖ, జార్ఖండ్ మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసులో అన్ని పరిణామాలను తాము పర్యవేక్షిస్తున్నానని, కుటుంబంతో కూడా టచ్‌లో ఉన్నానని మిట్టల్ తెలిపారు.