అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్..

అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్ కు చెందిన విద్యార్థి  కిడ్నాప్ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ అహ్మద్ ఓహియోలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు 2023 మేలో అమెరికాలో వెళ్లాడు. 2024 మార్చి 7 తేదీ నుంచి తమతో అబ్దుల్ అహ్మద్ మాట్లాడటం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. యూఎస్ లో చదువుతున్న తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని..లక్ష రూపాయలు ఇస్తే గానీ వదిలిపెట్టం అని గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయని అబ్దుల్ అహ్మద్ తల్లిదండ్రులు చెబుతున్నారు.  అహ్మద్ తల్లింద్రులు అమెరికాలోని వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అహ్మద్ ఆచూకీకోసం చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ కు లేఖ కూడా రాశారు అతని కుటుంబసభ్యులు. 

ఇటీవల ఓ భారతీయ విద్యార్థి శవమై కనిపించిన తర్వాత ఈ కిడ్నాప్ కలకలం రేపుతోంది. మూడు నెలల వ్యవధిలో ఇది తొమ్మిదవది. బోస్టన్ లోని ఇంజనీరింగ్ విద్యార్థి అభిజిత్ పరుచుూరు (20) మృతదేహం అడవిలో ఓ కారులో లభ్యమైన విషయం తెలిసిందే. అయితే అభిజిత్ మృతి సాధారణంగానే జరిగిందని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు.