అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి మృతిచెందింది.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవీల కుమార్తె పరిమళ(26) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నికిత్, పవన్ అనే మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. 

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిన్ లో శుక్రవారం అర్థరాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వచ్చి ట్రక్కు కారును ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన నాగశ్రీ వందన పరిమళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. 2022లో అమెరికా వెళ్లిన పరిమళ మెంఫిన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ) చేస్తోంది. మరో ఇద్దరు విద్యార్థులు వపన్, నికత్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.