అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. బర్త్ డే సెలబ్రేషన్స్‪లో గన్ మిస్ ఫైర్

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. బర్త్ డే సెలబ్రేషన్స్‪లో గన్ మిస్ ఫైర్

పుట్టిన రోజున అపశృతి చోటుచేసుకుంది. ఇండియా నుంచి అమెరికా వెళ్లిన 23ఏళ్ల విద్యార్థి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుండగా చనిపోయాడు. ఆర్యన్‌రెడ్డి అనే విద్యార్థి అమెరికా జార్జియా స్టేట్ అట్లాంటాలోని తన ఇంట్లో నవంబర్ 13న స్నేహితులతో కలిసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాడు. ఆర్యన్ రెడ్డి వేట తుపాకీని క్లీన్ చేస్తున్నాడు.. ఆక్రమంలో గన్ మిస్ ఫైర్ అయింది. ప్రమాదవశాత్తూ అతని ఛాతీకి బుల్లెట్ దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. 

తుపాకీ పేలిన సౌండ్ వినగానే.. వేరే రూమ్ లో ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్ వెళ్లి చూశారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలే.. ఆర్యన్ రెడ్డి చనిపోయినట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు. మృతుడు అట్లాంటాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. ఆర్యన్ తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని పెద్దరావు పల్లి గ్రామానికి చెందినవాడు. అయితే అతని కుటుంబం ప్రస్తుతం ఉప్పల్ జిల్లాలో నివసిస్తోంది. మృతుడి మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్వగ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.