వీసా రద్దుతో సెల్ఫ్ డిపోర్ట్..అమెరికా నుంచి తిరిగొచ్చిన ఇండియన్ స్టూడెంట్

వీసా రద్దుతో సెల్ఫ్ డిపోర్ట్..అమెరికా నుంచి తిరిగొచ్చిన ఇండియన్ స్టూడెంట్

వాషింగ్టన్: వీసా రద్దు కావడంతో ఇండియన్  స్టూడెం ట్​  రంజనీ శ్రీనివాసన్  తనకు తానుగా అమెరికా నుంచి సెల్ఫ్  డిపోర్ట్  అయింది. ఇటీవలే అమెరికాలోని పలు నగరాల్లో పాలస్తీనాకు అనుకూలంగా కొంతమంది ర్యాలీలు తీశారు. కొలంబియాలో నిర్వహించిన ప్రదర్శనలో రంజనీ కూడా పాల్గొన్నది. దీంతో అధికారులు ఆమె వీసాను ఈనెల 5న రద్దు చేశారు. 

‘‘హింస, టెర్రరిజంను ప్రోత్సహించేలా రంజనీ చర్య ఉంది. హమాస్ కు సపోర్టు చేస్తూ నిర్వహించిన ప్రదర్శనలో రంజనీ పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. ఆ ఫుటేజీలను తెప్పించుకొని పరిశీలించాం. ఆమె వీసాను రద్దు చేస్తున్నాం” అని డిపార్ట్ మెంట్  ఆఫ్​ హోంల్యాండ్  సెక్యూరిటీ ‘ఎక్స్’ లో తెలిపింది. 

కాగా.. తన వీసాను అధికారులు రద్దు చేయడంపై రంజనీ స్పందించింది. ‘‘వీసా పొంది అమెరికాలో చదువుకునే అవకాశం రావడం ఓ గొప్ప ప్రివిలెజ్. హింస, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే, కచ్చితంగా వీసాను రద్దు చేయాల్సింది. అలాంటపుడు అమెరికాలో ఉండకూడదు” అని రంజనీ ఓ వీడియోను రిలీజ్  చేసింది.