భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా : హమాస్ కు మద్దతుపై ఆరోపణలు : స్వచ్చంధంగా ఇండియాకు

భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా : హమాస్ కు మద్దతుపై ఆరోపణలు : స్వచ్చంధంగా ఇండియాకు

అమెరికాలో అక్రమ వలసదారులతోపాటు స్టూడెంట్స్ పై నిఘా పెట్టిన తర్వాత ఊహించని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ స్టూడెంట్ వీసా రద్దు చేసింది అమెరికా. పాలస్తీనీయులను అనుకూలంగా.. హమాస్ కు మద్దతు ఇస్తున్నట్లు భారతీయ స్టూడెంట్ రంజని శ్రీనివాసన్ పై ఆరోపణలు చేసింది అమెరికా. ఈ క్రమంలోనే ఆమె వీసా రద్దు చేసినట్లు వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనీయులను అనుకూలంగా ఓ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం.. స్టూడెంట్స్ పై నిఘా పెట్టింది. ఈ నిఘాలో భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ హమాస్ కు మద్దతు ఇస్తున్నట్లు నిర్థారణ అయ్యిందని.. ఈ క్రమంలోనే ఆమె స్టూడెంట్ వీసా రద్దు చేసినట్లు స్పష్టం చేసింది అమెరికా ప్రభుత్వం.

వీసా రద్దు అయిన వెంటనే.. రంజనీ శ్రీనివాసన్.. స్వచ్చంధంగా అమెరికా నుంచి బయలుదేరింది. 2025, మార్చి 11వ తేదీన అమెరికా వీడి వెళ్లిపోవటానికి.. ఆమె CBP హోం యాప్ ను ఉపయోగించి.. అమెరికా నుంచి రంజని శ్రీనివాసన్ స్వచ్ఛంధంగా వెళ్లిపోవటానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం. 

ALSO READ | టెర్రరిజం ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు

అమెరికాలో చదువుకోవటానికి వీసా మంజూరు చేయటం అనేది హక్కు, గౌరవంతో కూడిన అంశం. చదువుకోవటానికి వచ్చి.. హింస, ఉగ్రవాదాన్ని సమర్థించినప్పుడు వీసా హక్కును రద్దు చేయటం అనేది సరైన నిర్ణయం. అలాంటి వారు దేశంలో ఉండకూడదు. కొలంబియా యూనివర్సిటీలో ఉగ్రవాద సానుభూతిపరులలో ఒకరు తనకు తాను స్వీయ బహిష్కరణకు CBP హోం యాప్ ను ఉపయోగించటం చూసి నేను సంతోషంగా ఉన్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వింగ్ కార్యదర్శి క్రిస్టినోయెమ్ .. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. మార్చి 5వ తేదీన రంజని శ్రీనివాసన్ వీసా రద్దు అయితే.. మార్చి 11న ఆమె అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చిసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది. 

ఇంతకీ ఎవరీ రంజనీ శ్రీనివాసన్..? 

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో అర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్ కోర్సులో డాక్టరల్ డిగ్రీ చదువుతున్న భారతీయ స్టూడెంట్. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో మాస్టర్స్ చేశారు. 
శ్రీనివాసన్ ఇండియాలోని CEPT ( సెంటర్ ఫరన్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ )లో డిగ్రీ చేశారు. ఇది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉంది. 
ఇంతకీ రంజనీ శ్రీనివాసన్.. అమెరికా నుంచి బయలుదేరి ఇండియాలో ఎక్కడ దిగింది.. ఆమెది ఏ రాష్ట్రం.. ఆమె కుటుంబ సభ్యుల వివరాలు ఏంటీ అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు అమెరికా.